
–నకిలీ సర్టిఫికెట్లతో పొందిన సీట్లను తక్షణమే రద్దు చేయాలి : బేడ బుడగ జంగం జన సంఘం అధ్యక్షులు సిరిపాటి వేణు.
–మంత్రి అడ్లూరి లక్ష్మణ్, SC-ST కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందజేత
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ : రాష్ట్రంలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ MBBS Phase-I కౌన్సెలింగ్‌లో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా పొందిన సీట్లను తక్షణమే రద్దు చేయాలని, రాబోయే Phase-III కౌన్సెలింగ్‌లో అర్హులైన SC Group-I విద్యార్థులకు ఆ సీట్లను కేటాయించాలని బేడ బుడగ జంగం జన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు నాయకత్వంలో ప్రతినిధి బృందం నిన్న ప్రభుత్వం ముందు కీలక వినతులు సమర్పించింది.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి విజయేందిర బోయి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలను కలిసి వినతిపత్రాలు అందజేశారు.
బాధ్యులపై చర్యలకు మంత్రి ఆదేశం:
MBBS అడ్మిషన్లలో ఎస్సీ గ్రూప్-1 కేటగిరీకి జరుగుతున్న అన్యాయాన్ని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్ధన్, హైకోర్టు అడ్వకేట్ కత్తి లోకేశ్వర్ ఆధారాలతో అధికారులకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వెంటనే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) వైస్ ఛాన్సలర్‌తో మాట్లాడి, ప్రత్యేక D.O. లెటర్‌ను జారీ చేశారు.
అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ.. సెక్రటరీతో చర్చించి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలని, అర్హులైన SC Group-1 విద్యార్థులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సోమవారం మినిస్టర్ ఆఫీస్ నుండి KNRUHS వర్సిటీకి తగిన ఉత్తర్వులు పంపనున్నట్లు వెల్లడించారు.

పోరాటం కొనసాగుతుంది:
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు మాట్లాడుతూ.. అర్హులైన బేడ బుడగ జంగం విద్యార్థులందరికీ మెడికల్ అడ్మిషన్లలో పూర్తి న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎడవెల్లి వీరప్ప, జన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పత్తి బసవ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పెర జంగయ్యతో పాటు పర్వతం నారాయణ, పస్తం సంపత్, కడమంచి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ కొలుగూరి సుమలత – సుమన్ గారు, 10వ వార్డు కౌన్సిలర్, (ఇప్పల్ నర్సింగాపూర్) బిజెపి మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు – బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.





