
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, అక్టోబర్ 5: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ దివంగత సీనియర్ నాయకులు గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలను హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాకా చిత్రపటానికి హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెంకటస్వామి మన ప్రాంత అభివృద్ధికి, తెలంగాణ మలిదశ ఉద్యమానికి అందించిన సేవలు మరవలేనివని సుహాసిని, పలువురు నాయకులు కొనియాడారు. కార్మికుల హక్కుల కోసం, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ మేకల తిరుపతి, మండల ప్రెసిడెంట్ కే. కిరణ్, మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





