
- మెప్మా పిడి స్వరూప రాణి
- మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన యూనిఫారాలను అందజేయాలని మెప్మా పీడీ స్వరూప రాణి సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న విద్యార్థిని విద్యార్థుల కోసం యూనిఫారం కుట్టుట ప్రక్రియను ఏరియా లెవల్ సమాఖ్యలకు అప్పగించిన కార్యక్రమాన్ని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కరీంనగర్ మెప్మా జిల్లా పథక సంచాలకులు స్వరూపరాణి, మునిసిపల్ కమీషనర్ ఎస్ సమ్మయ్య ఆద్వర్యంలో పురపాలక సంఘం హుజురాబాద్ పరిధిలో గల యూనిఫారం కుట్టు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సమావేశములో భాగముగా యూనిఫారం కుట్టు సభ్యురాలితో యూనిఫారం కుట్టు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల ప్రకారం విద్యార్థుల యూనిఫారం కొట్టాలని, నాణ్యతగా ఉండి మన్నికగా, సౌకర్యవంతంగా ఉండేలా ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ లో మాత్రమే కుట్టాలని తెలిపారు. అనంతరం పురపాలక సంఘం హుజురాబాద్ కార్యాలయంలో పట్టణ ఆర్పీలతో సమావేశమై మెప్మా కార్యకలపాలపై రివ్యూ నిర్వహించారు. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ రామ్ మోహన్ రాయ్, ఏఈ సాంబరాజు, మెప్మా డీఏంసి శ్రీవాణి, ఏడిఎంసి మానస, సిఎల్ఆర్పిలు రమాదేవి, స్వరూప, టిఎల్ఎఫ్ ఆర్ పి అనూష తో పాటు ఆర్పీలు పాల్గొన్నారు.







