
-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హుజురాబాద్ మండలంలోని రాజపల్లి గ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ఆకస్మికంగా పర్యవేక్షించారు. పనుల్లో భాగంగా మేజర్, మైనర్ రిపేర్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్, బేస్మెంట్ రాళ్ల మధ్యలో ఉన్న సందులను పూడ్చడం తదితర పనులు 100శాతం చాలా చక్కగా పూర్తవడంతో సత్పతి సంతృప్తిని వ్యక్త పరిచారు. రాజపల్లి గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయుటకు, నిర్మాణంలో మంచి మేలు రకమైన మెటీరియల్ ని వాడుటకు కృషి చేసిన ఎంపీడీవోని, ఎంఈఓని, ఏఈని, వీఓ ఈర్ల వనమాలని, ప్రధానోపాధ్యాయుల్ని, కాంట్రాక్టర్ ని అభినందించారు. మండలం లోని మిగతా పాఠశాల పనులు త్వరిత గతిన 100శాతం పనులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రధానోపాధ్యాయులు రంగోజీ శ్రీనివాస్ ని ఎంత మంది చదువుతున్నారు అని ప్రశ్నించి.. 32 మంది ఈ పాఠశాలలో విద్యార్థులు ఉండడం, మొక్కలతో పరిసరాలు, కాంపౌండ్ వాల్ చక్కగా ఉండడం చూసి హార్షం వెలిబుచ్చారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కే విజయ్ కుమార్, ఎంపిడిఓ తూర్పాటి సునీత, ఎంఈఓ కేతిరి వెంకటనరసింహరెడ్డి, ఏఈ కే మల్లారెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ అనురాధ, పంచాయతీ సెక్రటరీ స్వర్ణలత, కారోబార్ తిరుపతి, సిఆర్ పి శనిగరం సుధామన్, అంగన్వాడీ టీచర్ రజిత తదితరులు ఉన్నారు.

