
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
కరీంనగర్ పట్టణ కేంద్రంలో భగత్ నగర్ 33వ డివిజన్ గట్టుమీద స్వయంభు వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి, అంజనాద్రి క్షేత్రంలో హనుమజ్జయంతిని పురస్కరించుకొని జూన్ 1 శనివారం ఉదయం 6.30నీ…స్వామివారికి విశేష ఫలపంచామృత అభిషేకము, అలంకారము, అర్చన, హనుమాన్ హోమము, ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించనున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా భక్తులందరూ భక్తిశ్రద్ధలతో సమకూర్చిన వెండి మకర తోరణం స్వామి వారికి అలంకరించబడుతుంది. ఈ అపూర్వ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని కార్యక్రమానంతరం అన్నప్రసాదం స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని “అంజనాద్రి క్షేత్రం కరీంనగర్” వారు తెలిపారు.