
– హుజురాబాద్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన ప్రణవ్
–వైద్య సదుపాయాలపై ఆరా
–ఆసుపత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి చెరొక 15లక్షల రూపాయల చొప్పున 30 లక్షలు కేటాయించామని, అవి పనులు పూర్తి అయ్యాయని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రినీ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శానిటేషన్, మెయింటినేన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని,100 డెలివరీలు ఈ మధ్య కాలంలో జరిగాయని చెప్పారు. రోగులకు మరింత భరోసా ఇచ్చేలా సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. హాస్పిటల్ అభివృద్ధికి వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి మరిన్ని నిధులు తీసుకొస్తామని అన్నారు. గతంలో ఉన్నదానికంటే ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కారం చూపిస్తున్నామని, డాక్టర్ల కొరత లేకుండా చూసుకుంటామని దీనిపై కలెక్టర్, డిఎంహెచ్వో తో మాట్లాడామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరెండెంట్ నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.








ఆస్పత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..


దవఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ప్రణవ్..





