
–హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఈ వాన కాలంలో రైతులకు సరిపడా వివిధ రకాల సబ్సిడీ విత్తనాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రైతులకు అన్ని రకాల నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు అందించుటకు సిద్ధంగా ఉంచిందని, రాష్ట్రంలో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవరిస్తుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు గానీ, బిజెపి పార్టీ నాయకులు గానీ అనవసరంగా రైతులను తప్పుదారి పట్టించే విధంగా సూచనలు చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేయడము ప్రతిపక్ష పార్టీలకు సరికాదు అన్నారు. అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉండేటట్లు రాష్ట్ర ప్రభుత్వము విత్తనాలను సరాపరా చేస్తున్నదని పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడము బి, బిజెపి పార్టీ నాయకులకు తగదు అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో ఈ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సారథ్యంలో కరీంనగర్ జిల్లా రైతులకు ఆమోదయోగ్యముగా వడ్లు, మక్కలు, పెసర్లు, బబ్బర్లు, కందులు, పత్తి విత్తనాలు అన్ని రకముల చిరు ధాన్యాలను ప్రోసెసింగ్ తో ఈ రైతులకు అందజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వము కృత నిశ్చయంతో పనిచేస్తుందని సొల్లు బాబు తెలిపారు.






