
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ కేంద్రంగా పివి హుజురాబాద్ జిల్లాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన జేఏసీ స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. జేఏసి స్టీరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం హుజురాబాద్ మునిసిపల్ పార్కులో జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ బీమోజు సదానందం మాట్లాడుతూ గతంలో హుజురాబాద్ పాత తాలూకా పరిపాలన కేంద్రంగా ఉండేదని, హుజురాబాద్ జిల్లా కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల ఉన్న 14 మండలాలను కలుపుకొని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2016లో చేసిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని కావున రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేస్తున్న జిల్లాల పునర్విభజన పైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పీవీ నరసింహారావు పేరుతో హుజురాబాద్ జిల్లాగా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాగా ప్రకటించే వరకు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఐకమత్యంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు వేల్పుల రత్నం, సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిసెట్టి వెంకట్రాజం, ఆలేటి రవీందర్, కొడిగూటి మొగిలయ్య, తాటిపల్లి రాజన్న, క్యాస రమేష్, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, వేల్పుల ప్రభాకర్, రామ్ సారయ్య,ఇల్లందుల సమ్మయ్య, రామ్ రాజేశ్వర్, మార్త రవీందర్, బత్తుల రాజలింగం, సందెల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






