
- సూపరింన్ టిన్డెంట్, ఆర్ ఎంవోలను మార్చితే తప్ప కష్టాలు తీరవు..
- -పలువురు రోగుల వెల్లడి..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల కష్టాలు అంతా ఇంతా కాదు.. కరెంటు పోయిందంటే గంటల తరబడి బాలింతలు, పసికందులు, రోగులు, నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. అసలే ఎండాకాలం పైగా ఉక్కపోతలు దానికి తోడు తాగునీరు అవసరానికి కావలసిన నీరు లేక ఆసుపత్రిలో రోగులు వారి బంధువులు శుక్రవారం తీవ్ర నీటి కష్టాలు పడ్డారు. ఆస్పత్రిలో ఉన్న వివిధ వార్డుల్లో ఉన్న రోగులు కాళ్ల కృత్యాలు, స్నానాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం ఆసుపత్రి ట్యాంకులో నీరు లేకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడ్డారు. నీరు లేక ఆస్పత్రి బయట ఉన్న వాటర్ ప్లాంట్లకు వెళ్లి కొంత నీరును కొనుక్కొని వచ్చి తమ అవసరాలు తీర్చుకున్నారని పలువురు రోగులు వాపోయారు. ట్యాంకులలో నీరు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని వారు ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆరున్నర గంటలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ వారు ముందస్తు రెండు రోజుల క్రితమే సమాచారం ప్రకటించినప్పటికీ ఆసుపత్రిలో పనిచేసే సంబంధిత అధికారులు, సిబ్బంది శ్రద్ధ చూపకపోవడంతో నీటి ట్యాంకులలో నీరు నింపకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డట్టు రోగులు, వారి బంధువులు ఆరోపించారు. జనరేటర్ ఉన్నప్పటికీ సిబ్బంది దానిని వాడడం లేదని రోగుల బంధువులు అంటున్నారు. దావఖానలో నిత్యం రోగులకు అందుబాటులో ఉండాల్సిన సూపరిండెంట్ గాని ఆర్ ఎం ఓ గాని దావకానలో అందుబాటులో ఉండకపోవడం ఎలాంటి సమస్య గురించి చెప్పిన పెద్దగా పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. అంతేగాక ఉదయం 5:30 గంటల నుండి సూర్యోదయం అయ్యి తొమ్మిది గంటల వరకు ఎండలు మండుతుండగా ఈరోజు 9:30 గంటల వరకు కూడా ఏ ఒక్క వైద్యుడు విధులకు రాకపోవడం ఓపిక వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 9 గంటల లోగా దావకానలో ఉండాల్సిన డ్యూటీ వైద్యులు దావకాలలో నిత్యం రోగులకు అందుబాటులో ఉండాల్సిన ఆర్ఎంవో వైద్య సేవలపై పెద్దగా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజేందర్ రెడ్డిని ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు. ఆర్ ఎం ఓ ఇష్టారాజ్యంగా దావకాన సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, రోగులకు అవసరమైన సేవల విషయంలో ఆర్ ఎం ఓ చెబితేనే చేస్తామంటూ పలువురు వైద్య సిబ్బంది రోగులను, వారి బంధువులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపించారు. ఇప్పటికైనా రోగుల పలు రకాల కష్టాలతో పాటు నీటి కష్టాల పట్ల ఆసుపత్రి ఉన్నతాధికారులు శ్రద్ధ వహించాలని రోగులు, ప్రజలు కోరుతున్నారు.









