
-ఆత్మ రక్షణకు ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాలి
-పలువురు అతిథులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
గ్లోబల్ శోటో కాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు హుజురాబాద్ పట్టణంలోని న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లో ఘనంగా కరాటే గ్రీటింగ్ బెల్ట్ టెస్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కరాటే విద్యార్థులు పాల్గొని వాళ్ల ప్రతిభ చూపించి బెల్టు సర్టిఫికెట్ లను తీసుకోవడం జరిగింది. సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు అమ్మాయిలు, అబ్బాయిలు ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ పేర్కొన్నారు. కరాటే శిక్షణ పొందుతూ చదువుతోపాటు క్రీడ రంగంలో అమ్మాయిలు ముందు భాగంలో ఉండాలని, ప్రతి ఒక్కరు ఇలాంటి రంగంలో అమ్మాయిలు రాణించాలన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్, సీనియర్ కరాటే మాస్టర్, అడ్వకేట్ బాణాల శ్యామ్ సుందర్, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మహమ్మద్ ఖాలిద్ హుస్సేన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు, జామ మజీద్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ సలీం, రెండవ వాడు కౌన్సిలర్ బి యాదిగిరినాయక్, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మొహమ్మద్ తౌసిఫ్ ,సోషల్ మీడియా నాయకుడు తులసి లక్షణామూర్తి, కరాటే విద్యార్థులు, తల్లిదండ్రులు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ను ఈ సందర్భంగా అభినందించారు.
