
-ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రణవ్ బాబు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఆంజనేయస్వామి పెద్ద జయంతిని పురస్కరించుకొని శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం, అయ్యప్పస్వామి దేవాలయంలోని ఆంజనేయ విగ్రహం వద్ద, పట్టణ శివారులోని రంగనాయకులగుట్ట వద్ద గల పాటి మీద ఆంజనేయ స్వామి దేవాలయాల్లో వేద పండితులు సాంప్రదాయబద్ధంగా శాస్త్రృయుక్తంగా వైభవంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకొని దేవాలయాలను చలువ పందిర్లు వేసి అందంగా అలంకరించారు. పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో అంజన్న మాల ధారణ వేసుకున్న స్వాములు ప్రతాప నాగరాజు అనే దాత భారీ హనుమాన్ విగ్రహాన్ని నిలబెట్టగా ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు దేవాలయంలోని గర్భగుడిలో ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. జయంతి పురస్కరించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ భజన మండలి వారు ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. వందలాదిమంది మాలధారణ భక్తులకు అన్నదానం నిర్వహించారు.
-ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని సువర్చల ఆంజనేయ స్వామి, పాటీ మీద ఆంజనేయ స్వామి దేవాలయంలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ ప్రాంగణంలో ఉన్న సరస్వతి మాతకు సహిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనను శాలువాలతో సత్కరించారు.
-ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రణవ్ బాబు
పట్టణంలోని హనుమాన్ దేవాలయం, వాటి మీది ఆంజనేయ స్వామివారిని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్న భక్తుడు ప్రతాప నాగరాజు ఏర్పాటు చేసిన భారీ ఆంజనేయ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, కౌన్సిలర్లు అపరాజ ముత్యం రాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పైళ్ల వెంకటరెడ్డి, ముక్క రమేష్, మక్కపల్లి కుమారస్వామి, బిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు గందె శ్రీనివాస్, భూసారపు బాపురావు, కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు, కొల్లూరు కిరణ్, తాళ్లపల్లి రమేష్, కాజీపేట శ్రీనివాస్, మహమ్మద్ కాళీద్ హుస్సేన్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, సందమల్ల బాబు, గోస్కుల రాజ్ కుమార్, మిడిదొడ్డి రాజు, వేద పండితులు అవధానుల భాస్కర్ శర్మ, తిరునగరి తిరుమలేష్, కుర్జీ ప్రదీప్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.









