
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితెల ప్రణవ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
జూన్ 2న తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలని, ఈ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 10 సంవత్సరాల తరువాత ప్రజలు కోరుకున్న, ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. తెలంగాణ వేడుకలు ప్రతి గ్రామాన కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా జరుపుకోవాలన్నారు.
కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ డే ఉత్సవాల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భాగస్వామ్యులు కావాలన్నారు.






