
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హైదరాబాదులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో హుజురాబాద్ కు చెందిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. అలాగే వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బాలుర ప్రభుత్వ పాఠశాల ఆవరణంలోని మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ బండ శ్రీనివాస్ ను ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బండ శ్రీనివాస్ బడుగు బలహీన వర్గాల కోసం అనుక్షణం పోరాడే వ్యక్తి అని కొనియాడారు. దళితుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేలా పోరాడాలని పిలుపునిచ్చారు. వేరువేరుగా జరిగిన ఆయా కార్యక్రమాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండి సలీం, వాకర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి గోవర్ధన్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తాళ్లపల్లి రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మక్కపెళ్లి రమేష్, కొన్ని రాజిరెడ్డి, బత్తుల సమ్మయ్య, భాస్కర్ చారి, బి శంకర్, బండ కిషన్, బోడుగే తిరుపతి, మరియు హాకీ సభ్యులు పాల్గొన్నారు.








