
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో ఆదివారం హుజూరాబాద్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం ఎన్ఎస్ యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శ ప్రశాంత్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలి దానాలను చూసి చల్లించిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సహకారం చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు బాయిని హనుమాన్, పట్టణ అధ్యక్షుడు మోరే అజయ్ ,మండల అధ్యక్షులు పంజాల అరవింద్, తటిపల్లి అరవింద్ , శనిగరం తరుణ్, మద్దెల రామ్ మోహన్, సంపత్, సాయికృష్ణ తోపాటు తదితరులు పాల్గొన్నారు.






