ఎంపీ ఎలక్షన్లలో నియోజకవర్గాల వారీగా ప్రధాన అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు ఇవే!

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:

పార్లమెంటు ఎన్నికలలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలు పరిశీలించినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల కంటే భిన్నంగా బిజెపి అత్యధిక ఓట్లు పొందగా రెండవ స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. ఒక హుస్నాబాద్ నియోజకవర్గ మినహా అన్నిచోట్ల బిజెపి అధిపత్యం ప్రదర్శించగా రెండవ స్థానంలో కాంగ్రెస్, మూడవ స్థానంలో బిఆర్ఎస్ నిలిచింది. ప్రస్తుత శాసన సభ్యులుగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన హుజురాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి, సిరిసిల్లలో కేటీఆర్, కరీంనగర్లో గంగుల కమలాకర్ లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయాచోట్ల బిజెపికి మెజార్టీ ఓట్లు పోలవడం ఓటర్లను ఆలోచింపజేస్తుంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కరీంనగర్ సెగ్మెంట్

బండి సంజయ్ 1,23,127
వినోద్ కుమార్ 29,334
రాజేందర్ రావు 63,755
సంజయ్ మెజార్టీ 59,372

చొప్పద౦డి సెగ్మెంట్

బ౦డి స౦జయ్ 94,992
వినోద్ కుమార్ 26,808
రాజేందర్ రావు 41,983
స౦జయ్ మెజార్టీ 53009

వేములవాడ సెగ్మెంట్

బ౦డి స౦జయ్ 81,714
వినోద్ కుమార్ 38,142
రాజే౦దర్ రావు 36,022
స౦జయ్ మెజార్టీ 43572

సిరిసిల్ల సెగ్మెంట్

బ౦డి స౦జయ్ 72,559
వినోద్ కుమార్ 65,811
రాజేందర్ రావు 33,610
స౦జయ్ మెజార్టీ 6,748

మానకొ౦డూర్

బ౦డి స౦జయ్ 77,282
వినోద్ కమార్ 32,095
రాజేందర్ రావు 52,769
స౦జయ్ మెజార్టీ 24,513

హుజురాబాద్

బ౦డి స౦జయ్ 73,280
వినోద్ రావు 47,379
రాజేందర్ రావు 50,306
స౦జయ్ మెజార్టీ 22,974

హుస్నాబాద్

బ౦డి స౦జయ్ 55,873
వినోద్ కుమార్ 41,293
రాజేందర్ రావు 79,001
రాజేందర్ మెజార్టీ. 23,128 క్లారిటీ కనపడింది.

కరీంనగర్ లో 90000 ఓటు నుండి 25000 కి BRS పడిపోయింది . హుస్నాబాద్, హుజూరాబాద్‌లలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంత తేడాతో నిలుపుకుంది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలల లోపే ఓటర్లు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల ఆకర్షితులు కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!