
స్వర్ణోదయం ప్రతినిధి, నల్గొండ: నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు శుక్రవారం కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 24 మంది సభ్యులను ఎలిమినేషన్ చేశారు. దీంతో రెండవ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో అభ్యర్థులు పొందిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 220 ఓట్లు
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 139 ఓట్లు
బిజెపి పార్టీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డికి 118 ఓట్లు
ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కు 76 ఓట్లు…మొత్తంగా
కాంగ్రెస్ – 1,23,033 (తీన్మార్ మల్లన్న)
బీఆర్ఎస్ – 1,04,387 (రాకేష్ రెడ్డి)
బీజేపీ – 43,431 (ప్రేమెందర్ రెడ్డి)
అశోక్ పాలకూరి (స్వతంత్ర) – 29,773
కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటీ – 18,646
ప్రారంభమైన స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ సాధించిన 29,697 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్ షేర్ చేయగా బిజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తోనే విజేతకు రావాల్సిన 1,55,095 ఓట్లు వచ్చాయి.
48 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతుండడంతో ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. కాగా గెలుపు కోటాకు దగ్గరలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. మొత్తం మీద సాయంత్రంలోగా విజేత ఎవరనేది తేలనున్నది.






