
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.
శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అక్షర యోధుడు రామోజీరావు అస్తమయం..
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామోజీరావు మృతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజే ఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు సంతాపం తెలిపారు. రామోజీరావు మృతి మీడియా రంగానికి తీరని లోటని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






