స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:
మోదీ 3.0 మంత్రివర్గంలో 72 మందికి చోటు కల్పించారు. ఇందులో మిత్రపక్షాల నుంచి 11 మంది ఉండటం గమనార్హం. వీరందరిలో 30 మందికి కేబినెట్ హోదా కల్పించారు. మొత్తం 39 మందికి గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మరో 23 మంది రాష్ట్ర అసెంబ్లీలో మంత్రులుగా చేశారు. కాగా.. 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, ఐదుగురు చొప్పున ఎస్టీ, మైనార్టీ కమ్యూనిటీలకు చెందిన నేతలకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుండి సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు అవకాశం కల్పించారు.