మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హుజరాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో మహిళల సంపూర్ణ ఆరోగ్యం దృష్ట్యా మినిస్టర్ కప్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాలవికాస వీడియో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మేనేజర్ మంజుల మహిళలు నెలసరి సమయంలో పాటించే విధానంలో ఉన్న అశుభ్రతను వాతావరణములో జరిగే అపరిశుభ్రత గురించి వివరించి, మినిస్టర్ కప్స్ వాడాలని సూచించారు. అమెజాన్ కంపెనీ వారి ఆర్థిక సహాయంతో 105 మినిస్టర్ కప్స్ మహిళలకు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భముగా మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి హెచ్ఐవి స్పెషలిస్ట్ సుజాత, వెంకట్రావుపల్లి మాజీ సర్పంచ్ తిరుమల, హుజురాబాద్ సెంటర్ మేనేజర్ సీఎం కాజాబి, కోఆర్డినేటర్ లీల, రజిత తదితరులు పాల్గొన్నారు.