
– సమాజంలో పోలీసులు అంటే గౌరవం ఉండాలి కానీ భయం ఉండకూడదు
– సైదాపూర్ ట్రైనింగ్ ఎస్సై భార్గవ్ మహేందర్ ను కొట్టిన దెబ్బలకు ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి
–తిప్పారపు సంపత్ టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశంలో తిప్పారపు సంపత్ టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇంచార్జి మాట్లాడుతూ గత 20 రోజుల కిందట సైదాపూర్ ట్రైనింగ్ ఎస్సై భార్గవ్ ఒక దళితుడిని చితకబాదిన విషయంపై అనేక సాక్షాలు జతచేస్తూ ఫిర్యాదు చేసిన కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడం చాలా బాధాకరం అని, ఈరోజు ఆయన కొడుతున్న వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగిందన్నారు. ఎస్సై భార్గవ్ ఒక నియంతల ఒక సైకోలా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ బాధితుడు మహేందర్ ను ఎలా చితకబాకుతున్నారో మీరే చూడాలని ప్రెస్ కు రిలీజ్ చేయడం జరిగింది. ఎస్సై భార్గవ్ కు కొట్టే హక్కు ఏ రాజ్యాంగంలో ఏ చట్టంలో ఉందని సూటిగా ప్రశ్నించారు. అసలు ఎస్సై భార్గవ్ రాజ్యాంగం మీద గాని చట్టం మీద గాని ఎలాంటి గౌరవం లేదనీ, అవగాహన కూడా లేదని ఇలాంటి వ్యక్తులు పోలీస్ వ్యవస్థలో ఉండడం ఆ వ్యవస్థకే మచ్చ తెస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎస్సై భార్గవ్ పై హత్యాయత్నం కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులను కోరుతున్నామన్నారు. పోలీసు వ్యవస్థపై గౌరవం ఉంది కాబట్టి దళితులు ఇప్పటివరకు ఎలాంటి ఉద్యమలు చేయడం లేదనీ, ఎస్సై భార్గవ్, కానిస్టేబుల్స్ ఆకాష్ రెడ్డి, రవికుమార్ లపై సస్పెన్షన్ వేటు వేయాలని ఈ సందర్భంగా సంపత్ డిమాండ్ చేశారు.



దళితుడైన మహేందర్ ను నానా బూతులు తిడుతూ, చితకబాదుతున్న ఎస్సై భార్గవ్, ఇద్దరు కానిస్టేబుళ్లు..


ఎస్సై, పోలీసులు కలిసి మహేందర్ ను చితకబాదుతున్న వీడియో సాక్షాన్ని విడుదల చేస్తున్న తిప్పారపు సంపత్..





