
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: జగిత్యాల జిల్లా రాయికల్‌లో మంగళవారం ఓ అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఇన్చార్జ్ తహసీల్దార్ గణేష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సింగరావుపేటకు చెందిన ఓ రైతు, తన భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ గణేష్ రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలపడంతో వారు ప్రత్యేకంగా పన్నిన Operational Trapలో భాగంగా ఈ ఉదయం గణేష్‌ను రూ.10,000 తీసుకుంటుండగా పట్టుకున్నారు. తదుపరి విచారణలో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు, మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఇన్చార్జి తహసిల్దార్, సీనియర్ అసిస్టెంట్..





