
-పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి: పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరును పునరుద్ధరించారు. అలాగే రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు చేసి అమలు చేయనున్నారు.
పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే?
- వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు)
- దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు)
- కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి ₹6,000
- కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000(గతంలో ₹5వేలు)
- మంచానికి పరిమితమైన వారికి ₹15,000 (గతంలో ₹5వేలు) ఈ విధంగా అర్హులకు పింఛను డబ్బులు నెలనెలా అందనున్నాయి.





