
స్వర్ణోదయం ప్రతినిధి, ములుగు: మందుపాతరాలు అమరుస్తుండగా ఒక డిప్యూటీ దళ కమాండర్, ఇద్దరు దళ సభ్యులు సహా ముగ్గురు మిలిషియా సభ్యులను ములుగు పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ- ఛత్తీస్గడ్ సరిహద్దులో గల వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు మగ మిలిసియా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి ఒక డిబిబిఎల్ ‘ తుపాకి, నాలుగు కిట్ బ్యాగులు, రెండు వాకి టాకీలతో పాటు భారీగా ప్రేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారి వివరములు: 1) కారం భుద్రి @ రీతా D/o విజ్ఞాలు, వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ దళ డిప్యుటీ కమాండర్, 2) సోడి కోసి @ మోతే D/o అడమాలు. పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు, 3) సోడి విజయ్ @ ఇడుమ s/o జోగ, బెటాలియన్ సభ్యుడు. 4) కుడం దస్రు s/o గంగ, మిలిషియా సభ్యుడు. 5) సోడి ఉర్ర s/o గంగయ్య, మిలిషియా సభ్యుడు, 6) మడకం భీమ s/ o కోస, మిలిషియా సభ్యుడు ఉన్నారు. కాగా పట్టుబడిన మావోయిస్టులు పలు నేరారోపిత కేసులలో ప్రధాన నిందితులని జిల్లా ఎస్పీ శబరిష్ తెలిపారు. ప్రభుత్వ నిషేదిత CPI మావోయిస్టు పార్టీలో పని చేస్తూన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీస్ ఎదుట స్వచ్చందంగా లొంగిపోవాలని జిల్లా ఎస్పీ శబరిష్ పిలుపునిచ్చారు.






