
–ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో దర్గాకు ప్రత్యేక నిధులు -రాష్ట్రంలో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం..
–ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాలో మంగళవారం ఉర్సు ఉత్సవాలు భాగంగా గంధాలను తీసుకువచ్చి హజ్రత్, సయ్యద్ ఇంకుషావలి సమాదులకు వస్త్రాలు సమర్పించారు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితెలా వోడితెల ప్రణవ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజిగిరి షరీఫ్ దర్గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని ఇక్కడికి భక్తులు కుల, మతాలకు, అతీతంగా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని చెప్పారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం , విశ్వాసంతో ఇక్కడికి వస్తున్నారన్నారు. వచ్చిన భక్తులకు దర్గా కమిటీ వారు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.
బాబా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వుండాలని నియోజకవర్గంలోని ప్రజలంతా పాడి పంటలు సమృద్ధిగా ఎదగాలని దేవుని కోరుకున్నానని అన్నారు. వోడితల ప్రణవ్ వెంట దర్గా కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులు పొన్నగంటి మల్లయ్య, కొల్లూరు కిరణ్, సుంకరి రమేష్, సజ్జు, మోలుగురి సదయ్య, సతీష్ రెడ్డి, పుల్లూరి సదానందం, సంపత్, రాహుల్, నాగభూషణం, కొమరయ్య, రాజకుమార్, రాచపల్లి రమేష్, వెంకటరెడ్డి, రాందాస్, రాములు, మల్లేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.







