
స్వర్ణోదయం ప్రతినిధి, బాసర: మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కీర్గుల్ కే గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..కదం గంగాధర్ (45) అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. జీవితం మీద విరక్తితో రోడ్డమోడ్ గుట్ట వద్ద గల చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
