
స్వర్ణోదయం ప్రతినిధి, అయోధ్య: అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ చేసిన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్(86) నిన్న శనివారం కన్నుమూశారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో ప్రధాన పూజారిగా ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ వ్యవహరించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాశీలో శనివారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, పలువురు కేంద్ర మంత్రులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.






