
స్వర్ణోదయం ప్రతినిధి, మణుగూరు: పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య(65) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన భద్రాద్రి జిల్లా మణుగూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆదివాసి దేవతలైన సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను ‘కంచు మేళం’ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆయన మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించింది.






