
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఛత్రపతి సాహు మహరాజు 150 వ జయంతి సందర్బంగా పట్టణంలోని మానవవాద నిలయంలో మానవ వికాస వేదిక, బీఎస్పీ మరియు మిత్రా సంఘాల ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజు జయంతి ఘనంగా నిర్వహించారు. భారతదేశం చరిత్రలో ఒక సువర్ణ రాజరిక పాలన జరిగిందనీ, సాహు మహారాజు మహాత్మ జ్యోతిరావు పూలే ఛత్రపతి శివాజీలా వారసుడిగా కృషి చేసిన మహా నీయుడు అన్నారు. భారతదేశంలో ఆర్థికంగా వెనుక బడిన కులాలను గుర్తించి వారికీ విద్యా వైద్యం మరియు వ్యవసాయం చేసుకొని జీవించే రైతులను సబండ జాతులు అందరు కూడ తన రాజ్యంలో బాధ పడకుండా జీవించాలనీ ఎంతో కృషి చేశారన్నారు. కులంతో పనీ లేకుండా అందరు సమానమే అనేది మార్పులు చేస్తూ వచ్చాడన్నారు. మహిళాల కోసం కూడ హక్కులు కల్పించిన గొప్ప వారు సాహు మహారాజు అని, ముందు తరాల చరిత్ర చదివి తన రాజ్యంలో వాటిని అమలు చేసిన మహనీయుడు సాహు మహా రాజు అన్నారు. ఇలాంటి చరిత్రలను మనం చదివి చైతన్యం అయి మనము కూడ సమాజంలో మార్పులు చేయడానికి ప్రయత్నం చేయండి అనీ చాలా మంది నాయకులు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా సాహు మహారాజుకి హుజురాబాద్‌లోని నాగరాజు ఆర్ట్స్ చౌడమల్ల నాగరాజు పూలమాల వేసి ప్రారంభించగా, సభ అధ్యక్షులుగా మానవ వికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంటల బుచ్చయ్య వ్యవహరించగా ఈ కార్యక్రమం లో వివిధ సంఘాల నాయకులు బీఎస్పీ నుండీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు సాహు మహారాజు చేసిన సేవలు, అభివృద్ధి గురించి చాలా విషయాలు వివరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వేల్పుల మల్లేష్, సంధ్యేల వెంకన్న, రాం శ్రీనివాస్, బెల్లి రాజయ్య, పల్లె ప్రశాంథ్, మారేపెల్లి మొగిలయ్య, మంద సమ్మయ్య, కలవ్వల మల్లయ్య, రామ్ సారయ్య, బొడ్డు ఐలయ్య, కొకంటి స్వామి, కొమురయ్య, కోడూరి సమ్మయ్య, వేల్పుల ప్రభాకర్, ఏం రవీందర్, చల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు.






