
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లి గ్రామ సమీపంలోని గొల్లపల్లిలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి కుక్క అడ్డూ వచ్చి బైక్ ను గుద్దడంతో బైక్ పై ఉన్నా భూపాలపల్లి సమీపంలోని ఆజామ్ నగర్ కు చెందిన లారీ డ్రైవర్ వోడితల శ్రీనివాస్ అనే వ్యక్తి కింద పడగా తలకు, కాళ్లకు చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రున్నీ 108 సిబ్బంది హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ mgm కు తరలించారు. శ్రీనివాస్ గత కొన్ని నెలలుగా హుజురాబాద్లో ఉంటూ లారీ డ్రైవర్ గా జీవనోపాధి పొందుతున్నట్లు అతని స్నేహితులు తెలిపారు.








