
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: భాగ్యనగరం బోనాల వేడుకలు షురూ అయ్యాయి. ఇవాళ్టి నుంచి ఆగస్టు 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారు తొలిబోనం అందుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవార్ల బోనాలు హైదరాబాద్ నివాసుల్ని కనువిందు చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండవ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం కావడంతో బోనాల వేడుకలు ఏ స్థాయిలో నిర్వహిస్తారోనని ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.






