
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డ్ లోని లోతట్టు ప్రాంతమైన బుడగ జంగాల కాలనీలో వర్షo నీరు ఆగడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారని స్వర్ణోదయం డిజిటల్ పేపర్ లో రావడంతో తక్షణమే స్థానిక వార్డ్ కౌన్సిలర్ మొలుగు. సృజన – పూర్ణ చందర్, మున్సిపల్ అధికారులు, స్పందించి ఆ వార్డ్ లో తిరుగుతు సమస్యలు స్థానికులను అడిగి తెలుసుకొని తక్షణమే పరిష్కారం చేశారు. నీరు నిలిచిన చోట కచ్చా కాలువలు కొట్టి నీటిని దారి మళ్లిచారు. గుడిసెలలోకి నీరు రాకుండా చుట్టూ కందకాలు కొట్టి నీరును కాలువ ద్వారా దారి మళ్ళించారు. పలువురికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లపై మొరం పోసి గుడిసెలలో నివసిస్తున్న వారికి పలు సూచనలు చేసి వర్షము నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి చైతన్యపరిచారు. దీనస్థితిలో ఉన్న పలువురికి స్థానిక కౌన్సిలర్ ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఏలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే స్థానిక కౌన్సిలర్ కు గాని, బల్దియా కమిషనర్, చైర్పర్సన్ కు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు. బుడగ జంగం కాలనీలో వీధిలైట్లు వెలిగేలా, గుడిసెలలోకి నీళ్లు వెళ్లకుడా తగిన ఏర్పాట్లు చేశారు. బుడగ జంగం కాలనీవాసులు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఏదైనా సమస్య తలెత్తితే తక్షణమే తమను సంప్రదించాలని స్థానిక కౌన్సిలర్ ములుగు సృజనా పూర్ణచందర్ హామీ ఇచ్చి, అండదండగా ఉంటారని పేర్కొన్నారు. వారి వెంట బల్దియా సిబ్బంది, స్థానిక నాయకులు, యువకులు, బుడగ జంగం కులస్తులు పాల్గొన్నారు.











