
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణకు కేంద్రం బడ్జెట్లో మొండి చేయి చూపడం అత్యంత బాధాకరం అని, అదే బిఆర్ఎస్ ఎంపీలు ఉంటే నిధుల విషయంలో వేరే విధంగా ఉండేదనీ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, హుజురాబాద్ సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నట్టు
కేంద్ర మంత్రి పదవులు ఇస్తే అక్కడికి సరిపాయేనా అన్నారు. అదే బిఆర్ఎస్ పార్టీకి 10 ఎంపీ సీట్లు ఇస్తే ఎలా ఉండేది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలన్నారు. నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశానిదా లేక బిహార్, ఏపీ రాష్ట్రాలదా అని కొండల్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి నిధులు. వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు. బిహార్లో రోడ్డు ప్రాజెక్టులకు రూ. 26,000 కోట్లు కేటాయించారని కానీ దీంతో 8 MPలు ఇచ్చిన తెలంగాణను మరిచిపోయారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. అప్పుడైనా ఇప్పుడైన ఎప్పుడైనా తెలంగాణ గళం దళం బలం ఒక్క బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఓటర్లు “0” సీట్లు ఇచ్చారు కాబట్టి దానికి ప్రతిఫలంగా కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రానికి దక్కింది కూడా “0” నే అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కు రూపాయి ధక్కాలన్నా అది కేసీఆర్ , బిఆర్ఎస్ పార్టీ వల్లే సాధ్యం అని ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించాలన్నారు. తెలంగాణ కి ప్రధాని నరేంద్ర మోడీ 2024 – 25 బడ్జెట్ లో కేటాయించింది “0”..? అయితే తెలంగాణ లో బీజేపీ ఎంపీలు 8 మంది ఉండగా అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నప్పటికీ తెలంగాణకు ఎలాంటి నిధులు రాకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర బడ్జెట్ లో కనీసం తెలంగాణ పదం ఊసే లేదనీ,ఇది సిగ్గు చేటు అని కొండారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ పీకేది ఏదీ లేదనీ, తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా మేల్కొనీ బీజేపీ ఎమ్మెల్యేలను ఎంపిలను నిలదీయాలని కొండల్ రెడ్డి పిలుపునిచ్చారు.






