
స్వర్ణోదయం ప్రతినిధి, తిరుమల – తిరుపతి : శ్రీవారి లడ్డుకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టుర్ కు టీటీడి షోకాజు నోటీసు జారీ చేసింది. తిరుమలలో లడ్డు తయారీకి వాడే నెయ్యిలో నాణ్యత లోపాలను టిటిడి అధికారులు గుర్తించారు. ఏటా తిరుమలలో ముడి సరకులు కోసం రూ 500కోట్లు టీటీడి వెచ్చిస్తుంది. అందులో 250 కోట్లు రూపాయలు ఒక నెయ్యి కోసం ఖర్చు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వాడే నెయ్యిను ఐదుగురు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్ సరఫరా చేసే నెయ్యిలో నాణ్యత లోపం ఉన్నట్లు గుర్తించిన టీటీడి అధికారులు. తమిళనాడు కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల : తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు రద్దయింది. మొత్తం 24 మంది సభ్యులు రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. వీరి రాజీనామాలతో టీటీడీకి కొత్త చైర్మన్‌ను, బోర్డు సభ్యులను నియమించు కోవాల్సి ఉంటుంది.







