
స్వర్ణోదయం ప్రతినిధి, సిద్దిపేట: ‘పుట్టుకతో ఎవరూ నాయకుడు కాలేరు. నాయకుడు తయారవుతాడు’ అని ప్రముఖ ఫుట్బాల్ కోచ్ విన్సి లంబార్డి ఎప్పుడో చెప్పారు. లీడర్ అంటే ఇన్స్పిరేషన్, లీడర్ అంటే మోటివేషన్. లీడర్ అంటే విజన్. ఈ లక్షణాలన్నీ కలగలిసినవాడే అసలైన లీడర్. అలాంటి నాయకత్వ లక్షణాలను పుట్టుకతోనే పుణికిపుచ్చుకున్న యువ తేజం కల్వకుంట్ల తారకరామారావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు 48వ పడిలోకి అడుగుపెట్టారు..
-సిద్ధిపేటలో జన్మించిన కేటీఆర్
తారక రామారావు 1976, జూలై 24న కేసీఆర్, శోభ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో జన్మించారు. 2ఏళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు.. హైదరాబాదులోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. 1990-91 హైదరాబాద్లో ఎస్ఎస్సీ.. 1991-93 గుంటూరులో ఇంటర్.. నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. అనంతరం అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ 1998-2000 ఎంబీఏ పూర్తిచేశారు.

