
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
స్వర్గీయ మాజీ ఎంపీ వొడితల రాజేశ్వరరావు 13వ వర్థంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో రాజేశ్వరరావు చిత్రపటానికి తుమ్మనపల్లి పిఎసిఎస్ చైర్మన్ కౌరు సుధాకర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా హుజురాబాద్ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిన రాజేశ్వరరావు ధన్యజీవి అన్నారు. ఆయన సేవలను హుజరాబాద్ ప్రాంత ప్రజలు ఎల్లవేళలా గుర్తించుకుంటారని ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుమ్మనపల్లి PACS చెర్మన్ కౌర్ సుగుణాకర్ రెడ్డితో పాటు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు, నాయకులు మిడిదోడ్డి శ్రీనివాస్, రమేష్, రియాజ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.






