
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా, పట్టణములోని వివిధ పాఠశాలల్లో స్వచ్ఛదనం – పచ్చదనం అంశము పై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు మంగళవారం బహుమతుల పంపిణీ జరిగింది. స్వచ్ఛదనం – పచ్చదనం కోసం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ పరిశీలించారు. పట్టణ ప్రజలకు మంచినీటిని అందించే టాంకులలో క్లోరినేషన్, బ్లీచింగ్ చేశారు. పట్టణములోని 30 వార్డులలో మురికి కాలువలలో పేరుకు పోయిన సిల్టు / చెత్తను తొలగించి, మురికి కాలువల వెంట బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా పెరిగిన గడ్డిని తొలగించి, జంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగినది. నీరు నిల్వ ఉన్న చోట ధోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్, థీమోపాస్ కెమికల్ ద్రావణమును పిచికారీ చేశారు. ఈ కార్యక్రమములో పురపాలక చైర్ పర్సన్ గందె రాధికతో పాటు వార్డు సభ్యులు, కమిషనర్ సల్వాది సమ్మయ్య , మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, ఇంచార్జీ మున్సిపల్ ఇంజనీర్ జి సాంబరాజు, టౌన్ ప్లానింగ్ అధికారి బషీర్, ఇంచార్జీ సానిటరీ ఇన్స్పెక్టర్ యం కిషన్ రావు, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ అశ్వినీగాంధీ, ఇంచార్జీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యండి రషీద్, జవాన్లు ప్రతాప రాజు, ఆరెల్లి రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.







