Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఈ శ్రమ్ కార్డు కలిగి ఉండి ప్రమాదవశాత్తు మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు, ప్రమాదవశాత్తు అంగవైకల్యానికి గురైన కార్మికులు ఈ శ్రమ్ కార్డు బీమా సౌకర్యాన్ని పొందాలని హుజురాబాద్ కార్మిక శాఖ సహాయ అధికారిని ఎల్ చందన కోరారు. మంగళవారం అమే విలేకరులతో మాట్లాడుతూ హుజురాబాద్ పరిధిలోని ఈ శ్రమ్ కార్డు ఉండి లబ్ధిపొందే అవకాశం ఉన్న వారు తమ దరఖాస్తులను ఈనెల 25వ తేదీలోగా సమర్పించాలని ఆమె కోరారు. దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 31 అయినప్పటికీ ఈ దరఖాస్తులను అన్ని కరీంనగర్లో సమర్పించడానికి సమయం కావాలని అందుకే 25 లోగా లబ్ధిదారులు హుజురాబాద్ కార్యాలయంలో సమర్పించాలని ఆమె కోరారు. దరఖాస్తు ఫారాలు కార్యాలయంలో లభిస్తాయని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబానికి 2 లక్షలు. ప్రమాదవశాత్తు అంగవైకల్యం కలిగిన కార్మికునికి లక్ష రూపాయలు భీమ వర్తిస్తుందని ఆమె తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తుకు
డెత్ సర్టిఫికెట్, పోస్టుమార్టం రిపోర్టు, శవపంచనామ నివేదిక, నామినీ ఆధార్, బ్యాంకు ఖాతా నెంబరు బుక్, కార్మికుని ఈ శ్రమ్ కార్డు, కార్మికుని ఆధార్ కార్డులను రెండు సెట్స్ కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. ఈ విషయంపై సందేహాలను కార్యాలయముకు వచ్చి నివృత్తి చేసుకోవచ్చని ఆమె సూచించారు.






