
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హర్ ఘర్ తిరంగా యాత్ర అభియాన్ కార్యక్రమంను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలో మంగళవారం బిజెపి నాయకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు మాట్లాడుతూ పట్టణంలో ప్రతి ఒక్కరు వారి ఇంటిపై జాతీయ జెండాను ఎగురావేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరంగా యాత్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్లు గంగిశెట్టి ప్రభాకర్, కొలిపాక వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, తూముల శ్రీనివాస్, యాంసాని శశిధర్, యాళ్ల సంజీవరెడ్డి, కొలిపాక శ్రీనివాస్, మునిగంటి నాగరాజ్, బోరగాల సారయ్య, నగేష్, దండ సమ్మిరెడ్డి, ఒడ్నాల విజయ్, కుసుమ సమ్మయ్య, క్యాస వెంకటేష్, మదిర రమేష్, గుల్ల అనిల్, హరీష్, తుర్పాటి రాజ్ కుమార్, భూతం సాయిరాం తదితరులు పాల్గొన్నారు

