స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: మండలిలోని తన ఛాంబర్‌లో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం స్వీకారం చేశారు. శాసన మండలి సభ్యులుగా ఫ్రొ,, కోదండరాం , అమీర్ అలీఖాన్ ల చేత ఎమ్మెల్సీలుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కూమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా ఉద్యమానికి లభించిన గౌరవం.
యావత్ తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు”ప్రత్యేక రాష్ట్ర”సాధనకోసం జరిపిన చారిత్రాత్మకమైన ఉద్యమానికి లభించిన గౌరవం అని, ప్రో.ఎం.కొదండరాం తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరిచడం సంతోషకరమని హుజురాబాద్ జేసి నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
స్వేచ్చా,స్వాతంత్ర్యాలతో పాటు ఆత్మగౌరవంతో జీవించే రాజ్యాంగ బద్ధమైన కనీస హక్కులకు విఘాతం ఏర్పడే సందర్భాల్లో తెలంగాణ ప్రజలకు ప్రో.కోదండరాం అండగా నిలవాలని, అలాగే అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలకు పరిష్కారం చూపేదశలో క్రియాశీలపాత్ర నిర్బహించాలని కోరారు.