స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
శ్రీహరికోటలోని షార్ నుంచి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్‌వీ-డీ3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈవోఎస్-08ను శాస్త్రవేత్తలు కక్ష్యలో రాకెట్‌ను ప్రవేశపెట్టారు. శుక్రవారం ఉదయం 9.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా.. 4 దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించారు. భూమికి 475 కి.మీ. ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. 16.57 నిమిషాల్లో ప్రయోగం ముగిసింది. ప్రయోగం విజయవంతం అవ్వడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.