
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కూచిపూడి నృత్య పోటీలలో ప్రథమ బహుమతి సాధించిన హుజురాబాద్ పట్టణానికి చెందిన కూచిపూడి కళాకారిణి నిర్విరెడ్డిని బుధవారo బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అభినందించి సన్మానించారు. రాజమండ్రి రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యంలో జూన్ 12 నుండి 15 వరకు జరిగిన కూచిపూడి నృత్య పోటీల్లో నిర్విరెడ్డి ప్రధమ స్థానంలో నిలిచింది. కాగా కూచిపూడిలో హుజురాబాద్ ఖ్యాతిని నిలిపిన నిర్విరెడ్డిని ఆమె తల్లిదండ్రులు మహేందర్ రెడ్డి, వినోద లను బిజెపి జిల్లా గంగాడి కృష్ణారెడ్డి అభినందించారు. కూచిపూడి లో నిర్విరెడ్డి మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని, భవిష్యత్తులో జాతీయస్థాయిలో జరిగే పోటీల్లో సైతం పాల్గొని తగిన గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు చిదురాల రాణి, శ్రీనివాస్ బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు తదితరులు పాల్గొన్నారు.

కూచిపూడి కళాకారిణి నిర్విరెడ్డిని అభినందిస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి





