
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు యతిపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా పోర్టు పోలియో జడ్జి మరియు హైకోర్టు జస్టిస్ కె లక్ష్మణ్ ని హుజురాబాద్ న్యాయవాదుల సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి హుజురాబాద్ లో అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని మరియు ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వినతి పత్రాలను అందజేసీ, హుజురాబాద్ కోర్టుకు రావాలని ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన జస్టిస్ కె లక్ష్మణ్ కుమార్ జిల్లా కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలను చీఫ్ జస్టిస్ కు పంపిస్తానని మరియు వెంటనే ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేస్తానని తెలుపుతూ అతి త్వరలోనే హుజురాబాద్ కోర్టును సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు యతిపతి అరుణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ ఎర్రోళ్ల రమేష్, ఉపాధ్యక్షులు నూతల శ్రీనివాస్ మరియు హుజురాబాద్ న్యాయవాదుల సంఘం ప్రధాన సలహాదారుడు అందే వెంకటేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది కట్టంగూరి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.








