Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బస్సులో ఎక్కాల్సిన మందికి మించి ఎగడంతో కొందరు దిగి వేరే బస్సులో రావాలని డ్రైవర్ ఎంతగానో చెప్పిన ఎవరూ పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా ఒళ్ళు మండిన డ్రైవర్ బస్సును నడిరోడ్డుపై ఆపడంతో గందరగోళంగా మారింది. వివరాలలోకి వెళితే! గురువారం సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్ కు వెలుతూ మధ్యలో ఉండే హుజురాబాద్ బస్ స్టేషన్ కు చేరుకుంది. అప్పటికే బస్సుల కోసం ఎదురు చూస్తున్న సుమారు 180 మంది ప్రయాణీకులు బస్సులో నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఎక్కేశారు. ఓవర్ లోడ్ అవుతుందని, బస్సును నడిపే పరిస్థితి ఉండదని డ్రైవర్ ప్రయాణీకులను వారించినా వినిపించుకోకుండా ఎక్కేశారు. అయితే సైడ్ మిర్రర్ ద్వారా వ్యూచూసే పరిస్థితి లేకపోవడంతో ఇతర వాహనాల రాకపోకలు గమనించే పరిస్థితి కూడా లేకుండా పోయింది డ్రైవర్ కు. దీంతో బస్సును రోడ్డుపై అలాగే నిలిపివేసి ముందుకు కదిలేది లేదని తేల్చి చెప్పాడు. సైడ్ మిర్రర్ నుండి సైడ్ వ్యూ చూడనట్టయితే ప్రమాదాలు జరుగుతాయని దీనివల్ల ఇతర వాహనాలపై వెల్లే వారు గాయాలపాలవుతారని డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేశారు. బస్సులోని ప్రయాణీకులు తనకు సహకరించి దిగిపోవాలని అభ్యర్థించాడు. దీంతో కొంతమంది ప్రయాణీకులు చేసేది లేక ఉసురుమంటూ కొందరు డ్రైవర్ చెప్పిన విషయాన్ని గమనించి బస్సు దిగిపోవడంతో ఆ బస్సును యథావిధిగా తిరిగి వరంగల్ కు తీసుకెళ్లారు. ఈ విషయం సోషల్ మీడియాకు తెలియడంతో దావణంలా ఈ న్యూస్ వ్యాప్తి చెందింది.






