Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులైన సరిత, విజయరెడ్డిలపై కొంతమంది దుండగులు దాడి చేయడం హేయమైనా చర్య అని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ ధర్మారెడ్డి, కో -కన్వీనర్లు కాయిత రాములు, సీనియర్ జర్నలిస్ట్ లు మండల యాదగిరి, నిమ్మటూరి సాయికృష్ణలు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. జర్నలిస్టుల విధులకు అటంకం కల్పించిన వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కెమెరాలు, ఫోన్లు లాక్కోవడం, దాడికి పాల్పడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనను ఖండించిన వారిలో సీనియర్ జర్నలిస్టులు తిరునగరి ఆంజనేయస్వామి, మామిడి రవీందర్, కోరం సుధాకర్ రెడ్డి, అల్లి నరేందర్, పరాంకుశం కిరణ్ కుమార్, ముస్కె శీనివాస్ ,మక్సుద్, కుమార్, పబ్బ తిరుపతి, సమ్మెట సతీష్, వేల్పుల సునీల్, టేకుల సాగర్, నరసింహారెడ్డి, శ్రీధర్, రాజు, రవీందర్ రెడ్డి, చందు, నంబి భరణి కుమార్ తదితరులు ఉన్నారు.






