
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని నలంద హై స్కూల్
1993-94 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం హుజురాబాద్ పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. అప్పుడు చదువుకున్న తమ స్నేహితులను, ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. తాము ఎంత ఎదిగిన పాత వారిని మరచిపోలేదని, మరిచిపోమని మరొకసారి కలుసుకోవాలని అనుకున్నారు. ఇంతకుముందు ఐదు సంవత్సరాలు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరిగిందని అదేవిధంగా ప్రతి ఏడాది నిర్వహించుకునేలా మిత్రులందరు సంసిద్ధం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజుల సునీల్, దాసరి రాజేందర్ రెడ్డి, సబ్బని తిరుపతి, కంకణాల రమేష్ రెడ్డి, రమణారెడ్డి, మంద వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.







