
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: 15 నాటికి రూ.2లక్షలలోపు ఉన్న రుణాలు మాఫీ చేశామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క స్పష్టతనిచ్చారు. శనివారం గోదావరిఖని సభలో ఆయన మాట్లాడుతూ.. పీపుల్స్ ప్రజాయాత్ర సమయంలో రామగుండంలో 6 రోజుల పాటు పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. 6 రోజుల పాదయాత్రలో సింగరేణి ప్రజల ఆవేదనను విన్నానని చెప్పారు. ఏ ఆశయం కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవి నెరవేరలేదని ప్రజలు బాధపడ్డారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆశలను వీరవెర్చే దిశగా పనిచేస్తుందన్నారు. ఆయన వెంట మంత్రులు ప్రభాకర్ గౌడ్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నారు.






