–శ్రీకృష్ణ భగవంతుని ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొన్న
భక్తులు
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 31: త్రైత సిద్ధాంత ప్రబోధా సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలో శ్రీకృష్ణ భగవానుడి ఊరు ఏరిగింపు కార్యక్రమం దిగ్విజయం నిర్వహించారు. త్రైత సిద్ధాంత ప్రబోధా సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక హుజురాబాద్ కమిటీ అధ్యక్షులు బాణాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని ప్రతిమను శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తేదీ ఆగస్టు 26న సోమవారం రోజున విద్యానగర్ కాలనీలో మండపం ఏర్పాటు చేసి కొలువు తీర్చి ప్రతిరోజు ఉదయము సాయంత్రం జ్ఞాన రీత్యా నిత్య పూజలు భగవద్గీత శ్లోక పారాయణం చేసి ఆరవ రోజు ఆగస్టు 31న శనివారం శ్రీకృష్ణ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. విద్యానగర్ కాలనీ నుండి ఊరేగింపుగా సూపర్ బజార్ రోడ్డు నుండి నేషనల్ హైవే రోడ్డు, సైదాపూర్ రోడ్డు నుండి విద్యానగర్ కాలనీ వరకు తిరిగి వేదిక వద్ద వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం ఊరేగింపుతో కృష్ణాష్టమి వేడుకలు ముగిశాయని నిర్వాహకులు ప్రకటించారు.
(ఊరేగింపు జన్మాష్టమి ఉద్దేశం)
దేవుడే మనిషిగా అవతరించి మనిషిగా జన్మిస్తే ఆయనను భగవంతుడని అంటాము. అలాంటి భగవంతుడే శ్రీకృష్ణుడు. ఆయనను మాత్రమే అందరూ దైవంగా గుర్తించాలని కృష్ణుడు పౌర్ణమి అమావాస్యలకి మధ్య అష్టమి తిథిలో పుట్టి జ్ఞాన అజ్ఞానములకు వారధిగా ఉన్నాడని, ఊరిలోని వారందరికీ ఎరుక పరుచుటకు ఈ ఊరు ఎరిగింపు (ఊరేగింపు) కార్యక్రమం చేస్తున్నామని ప్రబోధా సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక హుజురాబాద్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్ చారి, రమేష్ చారి, గోపికృష్ణ, వంశీకృష్ణ, తిరుపతి, రామస్వామి, రాంబాబు, శ్రీ కుమార్,శివసాయి, ఫణిందర్ రెడ్డి, నరేష్, లక్ష్మణ్, శ్రీధర్, కుమారస్వామి, రాహుల్, సిద్ధార్థ్, అభిరామ్ బిజేష్, జ్యోతి, సరిత, మౌనిక, చంద్రమ్మ, హిమా బిందు, ప్రియాంక, దివ్య, పద్మ, రాధిక, శకుంతల, శ్రీదేవి, ఉష బిజిలి, ఆశ్రిత, పల్లకి సేవలో పాల్గొన్నారు.