మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నిరంతరం ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండే వృత్తిని చేస్తున్న గీతా కార్మికులను ప్రమాదాల నుండి రక్షించే ఉద్దేశంతో వారికి శిక్షణ ఇప్పిస్తున్నట్లు హుజురాబాద్ ఎక్సైజ్ సీఐ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం హుజురాబాద్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచం కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, శంకరపట్నం, సైదాపూర్, వీణవంక మండలాలకు చెందిన 80 మంది గీత కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గీతా కార్మికులు నిరంతరం ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఏమాత్రం చిన్న తేడా వచ్చిన ప్రాణాలకు ముప్పు కానీ అంగవైకల్యం కానీ ఏర్పడే పరిస్థితి ఉంటుందని అన్నారు. వారికి రక్షణ కోసం శిక్షణ ఇప్పించడం జరుగుతుందని అన్నారు. ప్రతి గీతా కార్మికులు ప్రభుత్వం ఇచ్చే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీసు సిబ్బంది, గీతా కార్మికులు పాల్గొన్నారు.
- Home
- గీత కార్మికుల రక్షణ కోసం శిక్షణ – కాటమయ్య రక్షణ కవచంల పంపిణీ.. – ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ గౌడ్