Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: పర్యావరణ పరిరక్షణకై ఇంటింటా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హుజురాబాద్ పట్టణంలోని 28వ వార్డులో ప్రజలకు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా గురు, శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ లు మాట్లాడుతూ… ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారయ్యే వినాయక విగ్రహాలతో పర్యావరణం దెబ్బతింటుందని, తమ వంతు బాధ్యతగా పర్యావరణం కాపాడే ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని ప్రతిష్టించి పూజించినట్లయితే పర్యావరణ పరిరక్షణతో పాటు శుభాలు కలుగుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో గందే మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.






