Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా పూజలు అందుకున్న విజ్ఞాలను పాపే వినాయకుడి నిమజ్జన కార్యక్రమం సోమవారం హుజూరాబాద్ లో ప్రజలు, భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. హుజురాబాద్ పట్టణంతో పాటు మండలంలో గ్రామ గ్రామాన గణేష్ నిమజ్జన వేడుకలు ఆయా గ్రామాల చెరువుల్లో ప్రజలు నిర్వహించారు. హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సుమారు 120 వినాయక మండపాల్లో వినాయకులను ఆయా మంటప నిర్వాహకులు వాహనాలను అందంగా తయారుచేసి డబ్బు చప్పులతో నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఊరేగింపుగా తీసుకొని పట్టణ శివారులోని కాకతీయ కాలువ లో నిమజ్జనం చేశారు. పట్టణ నడిబొడ్డున మున్సిపల్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఉత్సవ విగ్రహాల ఊరేగింపు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. పట్టణంలోని వినాయకులకు రూట్ మ్యాప్ అందించి దాని ప్రకారం వినాయకులను వివిధ మార్గాల గుండా పట్టణంలో ఊరేగించి నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా అందంగా అలంకరింపజేసిన వాహనాలకు మున్సిపల్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ నిర్మల, మున్సిపల్ కమిషనర్ ఎస్ సమ్మయ్య,ఏఈ సాంబరాజు, మేనేజర్ భూపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు కళాకారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నిమజ్జనం ను కాకతీయ కాలువ వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ గంధేరాధిక కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వినాయక నిమజ్జనం సోమవారం తెల్లవారుజాము వరకు జరిగింది.
–ప్రత్యేక బందోబస్తు
వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్, రూరల్ సీఐ పులి వెంకట్ లు భారీ బందోబస్తు నిర్వహించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులను సహారాకు నియమించారు. నిమజ్జనం ప్రాంతంలో కూడా బందోబస్తు చేశారు.











